కరోనా వైరస్ జాగ్రత్తలు-నివారణ

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఈ వైరస్ బారిన పడి చైనాలో ఇప్పటి వరకు 560 మంది మరణించారు. ఈ కరోనా వైరస్ చైనాలోని వూహాన్ పట్టణం నుంచి పుట్టుకొచ్చి ప్రపంచ దేశాలకు విస్తరించింది. దీని ప్రభావం భారత దేశంలో కూడా పడింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. 

కరోనా వైరస్ ఎలా పుట్టింది?

ఈ వ్యాధి చైనా దేశంలో వూహాన్ అనే ప్రాంతంలో మొదటి సారిగా బయట పడింది. ఈ వైరస్ ను 1960లో కనుగొన్నారు. దీనిని మైక్రోస్కోప్ లో పరిశీలించగా ఈ వైరస్ కిరీటం ఆకారంలో ఉండటం వలన దీనికి కరోనా వైరస్ అని నామకరణం చేశారు. ఇవి ఆరు రకాలుగా ఉంది. పక్షులు, క్షీరదాలపై ఈ వైరస్ ప్రభవాన్ని చూపిస్తుంది. 

2019లో నావెల్ కరోనా వైరస్ ను ఏడో రకంగా గుర్తించారు. ఈ వైరస్ గబ్బిలాలలో ఉన్న కరోనా వైరస్, పాముల్లో ఉన్న కరోనా వైరస్ తో కవలడం వలన, ఈ ఏడో రకం కరోనా వైరస్ ఉద్భవించింది. దీనికి 2019న నావెల్ కరోనా వైరస్ గా నామకరణం చేశారు. ఇది మనుషుల నుంచి మనుషులకు వేగంగా వ్యాప్తి చెందుతుంది. 

కరోనా వైరస్ ముఖ్య లక్షణాలు ..

  1. జలుబు, దగ్గు, ముక్కు నుంచి కారటం
  2. తీవ్రమైన జ్వరం
  3. శ్వస తీసుకోవడంలో ఇబ్బంది
  4. ఛాతీ నొప్పి
  5. తీవ్రమైన న్యుమోనియాతో ఊపిరి తిత్తుల్లో సమస్య
  6. మూత్రపిండాలు విఫలం కావడం వలన మరణం సంభవించవచ్చు. 
  7. ఊపిరి తీసుకోవడం కష్టం.

వ్యాధి వ్యాపించే విధానం..

  1. పక్షులు, క్షీరదాలు, గబ్బిలాలు, పాముల నుంచి వ్యాపించును.
  2. మనుషుల నుంచి మనుషులకు దగ్గినపుడు, తుమ్మినపుడు, గాలి ద్వారా, తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. 
  3. పెంపుడు జంతువుల ద్వారా మనుషులకు వ్యాపించవచ్చు. 

నివారణ మార్గాలు …

ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదు. దీనికి నివారణ ఒక్కటే మార్గం.

వ్యాధి సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

  1. దగ్గు, తుమ్ములు, ముక్కు నుంచి కారటం వంటి లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండాలి.
  2. మాస్కులు ధరించాలి, దగ్గిన, తుమ్మిన చేతి రుమాలను అడ్డం పెట్టుకోవాలి. 
  3. ఇతరులను, అపరిచితులను తాకరాదు. 
  4. జన సంద్రమైన ప్రాంతాల్లో సంచరించరాదు. 
  5. చేతులను తరచూ పరిశభ్రంగా సబ్బు నీటితో కడుక్కోవాలి. 
  6. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. 
  7. చలి ప్రదేశంలో తిరగకుండా ఉండాలి. 
  8. సాధ్యమైనంత వరకు దూర ప్రాంతాలకు ప్రయాణం వాయిదా వేసుకోవాలి. 
  9. దగ్గు, జలుబు, ఛాతీలో నొప్పి మొదలగు లక్షణాలు కనిపించిన వెంటనే మీ సమీపంలో ఉన్న వైద్యులను సంప్రదించాలి. 
  10. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 
  11. సమతుల్య ఆహారం తీసుకోవాలి. 
  12. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.

Leave a Comment