దేశంలో కరోనా మరణాలు 308 

CoronaVirus, India లో విలయతాండవం చేస్తోంది. దీని కారణంగా ఇప్పటి వరకు మొత్తం 308 మంది మరణించారు.గత 24 గంటల్లోనే 35 మంది వరకు చనిపోయారు. ఇక దేశంలో Covid-19 పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 9,152 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

అదే సమయంలో Lockdown పొడిగిస్తే దేశంలోని అన్ని జిల్లాలను కలర్ కోడ్ చేసే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. 15 కంటే ఎక్కవ కేసులు వచ్చిన ప్రాంతాన్ని Red Jone గా, 15 కంటే తక్కువ కేసులు నమోదైన ప్రాంతాన్ని Orange Jone గా మరియు కేసులు లేని ప్రాంతాన్ని Green Jone విభజించి లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రం భావిస్తోంది. 

ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ దేశవ్యాప్త లాక్ డౌన్ ను రెండు వారాల పాటు పొడిగిస్తామని సూచించారు. అయితే ఆర్థిక వ్యవస్థ మనుగడను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాంతాల్లో సడలింపు ఉంటుంది చెప్పారు. 

AP లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 427కు చేరింది. ఇక అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా గుంటూరు జిల్లా 89 కేసులతో టాప్ లో ఉంది. కర్నూలు జిల్లా 84 కేసులతో తర్వాతి స్థానంలో ఉంది. 

ఇక Maharashtra కరోనా తో అల్లాడుతోంది. దేశంలో అత్యధిక కేసులు నమోదైంది. మహారాష్ట్రలోనే. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1,985 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1,154 కేసులు, తమిళనాడులో 1,075 కేసులు, రాజస్థాన్ లో 804 కేసులు, మధ్యప్రదేశ్ లో 532, గుజరాత్ 516 కేసులు నమోదయ్యాయి. 

  

Leave a Comment