1918లో కరోనా తరహా మహమ్మారి..!

ప్రతి వందేళ్లకు ఒక వైరస్ వచ్చినట్లు చరిత్ర చెబుతుంది. సుమారు వందేళ్ల కిందట కరోనా తరహా వైరస్ దేశంలో వచ్చినట్లు తెలిసింది. కరోనా తరహా వైరస్ వందేళ్ల కిందట వచ్చినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. 1918 మొదలైన వైరస్ పదేళ్ల వరకు కొనసాగినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి 1928 లో బెంగళూరు సిటీ మున్సిపల్ కౌన్సిల్ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారి జారీ చేసిన రెండు నోటీస్ లు బయటకు వచ్చాయి. ఈ నోటీసుల్లో వ్యాధి లక్షణాలు, దానికి సంబంధించి ఔషధ చికిత్సలు వివరించారు. అప్పుడు కూడా జ్వరం, జలుబు, దగ్గుతో ప్రజలు బాధపడినట్లు తెలుస్తోంది. 

మొదటి నోటీసులో ఏముందంటే..

  • ప్రజలు గుంపులుగా ఉండే స్థలాలకు దూరంగా ఉండాలి.
  • జలుబు చేసిన వారికి దూరంగా ఉండాలి.
  • రాత్రి పగలు స్వచ్ఛమైన గాలి వీచే స్థలంలో ఉండాలి.
  • శరీరం, మనసు అలసిపోయే పనులు చేయకూడదు.
  • ప్రతి రోజూ మరుగుదొడ్డికి వెళ్లాలి.

నోటీస్ – 2లో వ్యాధి బారిన పడిన వారు పాటించాల్సిన నియమాలు..

  • జ్వరంతో కూడిన జలుబు వస్తే వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. 
  • రోగులు గది కిటికీ తలుపులు గాలి వచ్చే విధంగా చూసుకోవాలి. స్వచ్ఛమైన గాలి వెలుతురుతో వైరస్ తగ్గుతుంది. 
  • సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి మందులు తీసుకోవాలి.
  • సిన్ అమ్మోనేటెడ్ క్వినైన్ మందు తీసుకోవాలి.
  • లవంగం, మిరపకాయ, ఎండిన అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని అర తులం, దానికి రెండు వెల్లుల్లి రెబ్బలు కలిపి తయారు చేసిన కాషాయం తీసుకోవాలి. 

 

Leave a Comment