9 రాష్ట్రాలకు ICMR హెచ్చరిక..థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది జాగ్రత్త..!

కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గముఖం పట్టింది. దీంతో పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్లు తెచుకుననాయి. ఈక్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) హెచ్చరిక జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ తో సహా 9 రాష్ట్రాలకు కరోనా థర్డ్ వేవ్ ముప్పుపొంచి ఉందని అలర్ట్ చేసింది. వచ్చే రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ హెచ్చరించింది.

మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, హర్యానా, గుజరాత్, జార్ఖండ్, గోవా, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కరోనా ముప్పు పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరిక జారీ చేసింది. థర్డ్ వేవ్ వస్తుందా లేదా అనేది ప్రజలపై ఆధారపడి ఉంటుందని ఎయిమ్స్ భోపాల్ డైరెక్టర్ డాక్టర్ శర్మన్ సింగ్ తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరికీ టీకాలు వేస్తే థర్డ్ వేమ్ ముప్పును నిరోధించవచ్చని అన్నారు. ప్రస్తతం మధ్యప్రదేశ్ లో 123 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 14 కొత్త కేసులు వెలుగుచూశాయి.  

  

Leave a Comment