చిరంజీవికి కరోనా పాజిటివ్.. ‘అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ’..!

కరోనా థర్డ్ వేవ్ ఎవ్వరినీ వదలట్లేదు.. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారినపడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది సినీ నటులు కరోనా బారిన పడ్డారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. రిపోర్టులో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు. 

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చిరంజీవి పేర్కొన్నారు. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు ఉండటంతో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నానని, కొద్ది రోజులుగా తనను కలిసిన వారు అందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా తిరిగివస్తానని చిరంజీవి ట్విట్ లో పేర్కొన్నారు. దీంతో చిరంజీవి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.    

 

Leave a Comment