విటమిన్ డి ఎక్కువైతే కలిగే సైడ్ ఎఫెక్ట్స్..!

మన ఆరోగ్యానికి విటమిన్స్ చాలా అవసరం. అన్ని విటమిన్స్ సరైన స్థాయిలో దొరకకపోతే శరీరపు పని తీరు బారీగా దెబ్బ తింటుంది అని వైదులు అంటున్నారు. అన్ని విటమిన్లు లాగానే విటమిన్ డీ మన శరీరానికి చాలా అవసరము. విటమిన్ డీ ఒక స్టెరాయిడ్ హార్మోన్, ఈ విటమిన్ డీ సూర్య రశ్మి వల్ల శరీరంలో యాక్టివేట్ అవుతుంది. లేదా, ఆహారం నుండీ, డయటరీ సప్లిమెంట్స్ నుండి వస్తుంది. కాల్షియంని గ్రహించాలంటే శరీరానికి తప్పకుండా విటమిన్ డీ అవసరం. ఎముకలు ఆరోగ్యముగా ఉండడానికి కూడా విటమిన్ డీ చాలా అవసరము.

 విటమిన్ డీ మనలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కండరాల కణాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా ప్రస్తుత కరోనా ఉన్న సమయములో విటమిన్ డీ పాత్ర ఎంతో ఉన్నది. చాలా సమయములో వైద్యులు కూడా కరోనా సోకిన వారికి  విటమిన్ డీ ఎంతో అవసరము అని చెప్పారు. అందుకే చాలా మంది డి విటమిన్ ట్యాబ్లెట్స్‌ను ఎక్కువగా తింటున్నారు. అయితే,  విటమిన్ డీ ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి అని నిపుణులు అంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్‌కు లక్షణాలు కనిపించినా వెంటనే డి విటమిన్‌ను తీసుకోవడం మానేయాలి.

నిజానికి శరీరంలో విటమిన్ డి పెరగడానికి ఉదయం సమయంలో ఎండలో ఉండటము చాలా మంచిది.ఇలా కూర్చోవడము మంచి మార్గం. అలాకాకుండా అధిక పోషకాహారాలు తినడం, సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కూడా శరీరంలో విటమిన్ డి అవసరమైన మొత్తాన్ని పొందవచ్చు. విటమిన్ డి వల్ల మన శరీరానికి అధిక ఉయోగాలు ఉన్నాయి. విటమిన్ డి తక్కువ అయ్యితే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలసట, బలహీనత, ఎముకల నొప్పి, కండరాల బలహీనత, కండరాల నొప్పులు, ఉంటాయి.

శరీరంలో విటమిన్ డీ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో కాల్షియం స్థాయి ఎక్కువ అవుతుంది. కాల్షియం, హార్మోన్లు కలిసి ఎముకలకు పోషకాన్ని అందకుండా అవుతుంది. ఇది కీళ్ల నొప్పులకు కారణము అవుతుంది. విటమిన్ డి ఎక్కువ  అవ్వడము వల్ల టాక్సిసిటీ, హైపర్విటమినోసిస్ డి అనే అరుదైన పరిస్థితి వస్తుంది. అయితే, సూర్యరశ్మి వల్ల,లేక విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారము వల్ల హైపర్విటమినోసిస్ ఎప్పుడూ రాదు. కేవలం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్లే ఇలా జరుగుతుంది. నిజానికి మన శరీరంలో కాల్షియం స్థాయి 8.5 నుంచి 10.8 mg/dL మధ్య ఉండాలి. 

ఈ స్థాయిని దాటినప్పుడు వికారం, వాంతులు, బలహీనత, తరచుగా మూత్రవిసర్జన,ఇలాంటి సమస్యలు మన శరీరాములో వస్తాయి. విటమిన్ డి టాక్సిసిటీ వల్ల వచ్చే హైపర్‌కాల్సెమియా కూడా కిడ్నీ సమస్యలను తెచ్చి పెడుతుంది. ఇలా అవ్వడము వల్ల ఎక్కువ స్థాయిలో  మూత్రవిసర్జన అవుతుంది,ఈ పరిస్థితిని పాలీ యూరియా అని అంటారు. ఈ లక్షణాలు మీలో ఉంటే వెంటనే  విటమిన్‌ డీ టాబ్లేట్సని తీసుకోవడము ఆపాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

 

Leave a Comment