కరోనాకు చికిత్స ఉండకపోవచ్చు – WHO

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ రూపొందించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మరో బాంబు పేల్చింది. కరోనా వైరస్ ను నిరోధించేందుకు చికిత్స ఏదీ లేకపోవచ్చు అని వ్యాఖ్యానించింది. కరోనా వైరస్ కట్టడికి జాగ్రత్తలు పాటించాలని చెప్పింది. కరోనాను అడ్డుకునేందుకకు టెస్టింగ్, ట్రేసింగ్, సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని కోరింది. 

ప్రస్తుతానికి కరోనా వైరస్ ను అంతం చేయలేమని, దీనికి చికిత్స ఎప్పటికీ రాకపోవచ్చని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ వెల్లడించారు. ‘ ఈ వైరస్ మనుషుల్లో ఎలా ప్రవేశించిందో తెలుసుకునేందుకు WHO ఇద్దరు సభ్యులను చైనాకు పంపింది. వీరు ప్రాథమిక విచారణను ముగించారు. త్వరలోనే వైరస్ మూలాలను కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తాము’ అని టెడ్రోస్ అధనోమ్ వెల్లడించారు.  

 

Leave a Comment