కరోనా ఎఫెక్ట్ : ఖాళీ అవుతున్న హైదరాబాద్..!

భారతదేశ సుప్రసిద్ధ నగరాలలో హైదరాబాద్ నగరం ఒకటి. ఎంతో మంది తమ బతుకు తెరువు కోసం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అలాంటి హైదరాబాద్ లో కరోన బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ఉపాధితో హైదరాబాద్ లో స్థిరపడిన వారు గ్రామాల బాట పడుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉంటే చాలంటూ అద్దె ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. తమతమ ఊళ్లకు పయనమవుతున్నారు. దీంతో హైదరాబాద్ లో టూలెట్ బోర్డుల దర్శనమిస్తున్నాయి.

ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఎవరికీ ఉపాధి లేకుండా పోయింది. విద్యార్థులు కర్సులు చేసుకోవడానికి ఇన్ స్టిట్యూట్స్ కూడా లేవు. ఇక ఇళ్లల్లో ఉన్న కొద్ది అద్దె భారం పెరిగిపోతుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక తమ తమ గ్రామాలకు వెళ్లిపోతున్నారు. సికింద్రాబాద్ లోని చిలకలగూడ, సీతాఫల్ మండి, బోయిన్ పల్లి, అల్వాల్, మారేడ్ పల్లి, శిరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఇళ్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఆయా ఇళ్లు, అపార్టుమెంట్లకు టూలెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 

హైదరాబాద్ నుంచి ఏపీ ప్రజలు కూడా తమతమ స్వస్థలాలకు పయనమవడంతో సరిహద్దుల వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఏపీ పోలీసులు మాత్రం పాస్ ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక పాస్ లేని వారు ముందుకు పోలేక వెనక్కి వెళ్తున్నారు. 

 

Leave a Comment