బెంగాల్ టైగర్ పిల్లకు కల్నల్ సంతోష్ బాబు పేరు..!

గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి కల్నల్ సంతోష్ బాబు మరణించిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ కల్నల్ సంతోష్ బాబుకు ఘన నివాళులర్పించింది. జంతు ప్రదర్శన శాలలో ఇటీవల పుట్టిన పులి పిల్లకు కల్నల్ సంతోష్ బాబు పేరు పెట్టారు. ఆయన గుర్తుగా గౌరవప్రదంగా ఈ పేరును పెట్టినట్లు జంతు ప్రదర్శన శాఖ క్యూరేటర్ క్షితి తెలిపారు. ఇటీవల జూలో ‘ఆశ’ అనే రాయల్ బెంగాల్ టైగర్ మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒక దానికి సంతోష్ పేరు పెట్టగా, మిగిలిన పిల్లలకు సూర్య, సంకల్స్ అనే పేర్లు పెట్టారు. 

 

Leave a Comment