నాణ్యత తగ్గకూడదు : సీఎం జగన్ 

అమరావతి : మధ్యాహ్న భోజనంలో నాణ్యత తగ్గకూడదని సీఎం జగన్ అన్నారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు కూడా పరిశుభ్రంగా ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఒక ప్రత్యేక యాప్ ద్వారా వీటిని పర్యవేక్షిస్తున్నామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ఆ రెండు యాప్ లు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా పరిశీలించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. నాడు-నేడు ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. డిజిటల్ బోధనకు ప్రతి పాఠశాలకు స్మార్ట్ టీవీ ఏర్పాటు చేస్తామన్నారు.  

నాడు – నేడు తొలివిడతలో భాగంగా 15,715 స్కూళ్లలో పనులు జరుగుతున్నాయని, వాటిని వేగంగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. జూన్‌ నాటికి పాఠశాలలు ప్రారంభం అవుతాయి కాబట్టి, అప్పటికి పనులు పెండింగులో ఉండకూడదన్నారు. 

 స్కూల్‌ ఎడ్యుకేషన్‌పై సమీక్ష..

జగనన్న విద్యా కానుకలో ఆరు రకాల వస్తువులు పంపిణీ చేస్తామన్నారు. మూడు జతల యూనిఫారం, నోట్ పుస్తకాలు, షూ, సాక్స్, బెల్టు, బ్యాగు, టెక్ట్స్ బుక్స్‌ ఈ కిట్‌లో ఉంటాయన్నారు.  యూనిఫారమ్స్, బెల్టు, బ్యాగుల నమూనాలను అధికారులు సీఎంకు చూపించారు. పిల్లలకు ఇచ్చే వస్తువులు నాణ్యతతో ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించారు. 

 

Leave a Comment