ఆయుర్వేద మందుపై అధ్యయనానికి సీఎం జగన్ ఆదేశం..!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద మందుపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆ మందు పంపిణీ చేయాలా? వద్దా? అనే అంశంపై అధికారులు, నిపుణుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఆయుర్వేద మందుపై అధ్యయనం జరిపేందుకు నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందాన్ని పంపించాని అధికారులకు సూచించారు. 

కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆనందయ్య ఇస్తోన్న ఆయుర్వేద ఔషధం అధ్యయనం చేయనున్నారు. సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరు వెళ్లే అవకాశం ఉంది. ఈక్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ రావద్దని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కోరారు. 

మందు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేత..

ఇక ఆయుర్వేద మందు కోసం జనం పోటెత్తడంతో మందు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేశారు. భౌతిక దూరం లేకుండా క్యూ లైన్లు కడుతుండటంతో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మళ్లీ పంపిణీ తేదీ ప్రకటిస్తామని ప్రకటించారు. అయితే రేపటి నుంచి విశాలమైన గ్రౌండ్ లో మందు పంపిణీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కోరారు. 

Leave a Comment