మనుషుల మాదిరిగానే బట్టలు ఉతుకుతున్న చింపాంజీ.. వీడియో వైరల్..!

తెలివైన జంతువులలో చింపాంజీ కూడా ఒకటి.. వాటి పోలీకలు మానవులతో పోలి ఉంటాయి. కోతి నుంచి మనిషిగా మారినట్లు సైన్స్ కూడా చెబుతుంది. అందుకే చింపాంజీలు మానుషులను అనుకరిస్తుంటాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో.. ప్రస్తుతం ఈ చింపాంజీ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ వీడియోలో జంతుప్రదర్శనశాలలో ఓ చింపాంజీ బట్టలు ఉతకుతుంది. పసుపు రంగు టీషర్టుపై సబ్బును అప్లయి చేసి తన చేతితో రద్దుతుంది. తర్వాత అక్కడే ఉన్న ఒక బ్రష్ తీసుకొని ఆ టీషర్టుపై గట్టిగా రద్దుతుంది. ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారో తెలియదు. కానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేను నా కొత్త ఇంటి పని మనిషిని వెతుకున్నాను అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment