ఐపీఎల్ లో అదరగొట్టిన అంబటి రాయుడు..!

గతేడాది టీ20 వరల్డ్ కప్ లో ఎంపిక చేయలేదు. మనస్తాపంతో ఇంటర్నేషల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు..అయినా అతనిలోని సత్తా తగ్గలేదు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్ తరపున ఆడి ఆదరగొట్టాడు. అతడే అంబటి రాయుడు..ముంబైతో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాయుడు బ్యాటింతోలో సత్తాచాటాడు..తాను ఎంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. 

ఐపీఎల్ సీజన్ 13 ప్రారంభ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(12) పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. ఆ తర్వాత డికాక్(33), సౌరభ్ తివారీ(42) పరుగులు చేశారు. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 6 పరుగులకే ఓపెనర్లు మురళీ విజయ(1), షేన్ వాట్సన్(4) వికెట్లను కోల్పోయింది.  

ఈ సమయంలో బరిలోకి దిగిన రాయుడు మంచి ఆటతీరు కనబరిచాడు. డిప్లెసిస్(44) తో కలిసి జట్టును ఆదుకున్నాడు. చక్కటి షాట్లతో మెరిపించాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ లతో 71 పరుగులు చేసి ఔటయ్యాడు. అయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. 

You might also like
Leave A Reply

Your email address will not be published.