బాలీవుడ్ నటుడు రిషి కపూర్ మృతి

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణంతో షాక్ లో ఉన్న సినీ రంగాకి మరో షాక్ తగిలింది. బాలీవుడ్ వెటరన్ హీరో రిషి కపూర్(67) కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న సాయంత్రం ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు. కొంత కాలంగా రిషికపూర్ కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. రిషి కపూర్ కు ఒక కుమారుడు రణబీర్ కపూర్, కుమార్తె రిథిమా ఉన్నారు. 

రిషి కపూర్ 1952 సెప్టెంబర్ 4న ముంబైలో జన్మించారు. ఆయన ప్రముఖ నటుడు రాజ్ కపూర్ కి రెండో కుమారుడు. రిషి కపూర్ మేరా నామ్ జోకర్ సినిమాలో బాల నటుడిగా నటించాడు. తర్వతా ఆయన బాబీ సినిమాతో హీరోగా ఆరంగేట్రం చేశారు. ఆయన నటించిన ఎన్ని సినిమాలు హిట్ గా నిలిచాయి. 1980లో సహ నటి రితూ సింగ్ ను పెళ్లి చేసుకున్నారు. రిషికపూర్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు. 

 

Leave a Comment