సైబర్ నేరగాళ్ల నుంచి ఇలా రక్షణ పొందండి..!

ఈ మధ్య సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ బ్యాంకింగ్ లోె రకరకాల ఆఫర్లు చూపే మెసేజ్ లు పంపి ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇలాంటి వాటికి ఆశపడి చివరకు ప్రజలు తమ డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. 

సైబర్ నేరగాళ్లను నుంచి జాగ్రత్తగా ఉండేందుకు భారత దేశపు అతి పెద్ద బ్యాంక్ SBI తన వినియోగదారులకు పలు సూచనలు తీసుకొచ్చింది. ఆన్ లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించమని చెబుతుంది. తన వినియోగదారుల భద్రత కోసం కొన్ని చిట్కాలను అందించింది. 

SBI  కస్టమర్లకు సూచనలు..

  • EMI లేదా DBT లేదా PMCare Fund లేదా ఇతర కేర్ ఫండ్ కు సంబంధించి OTP లేదా బ్యాంక్ వివరాలు అడిగే అనధికార లింక్లపై క్లిక్ చేయకూడదు. 
  • భారీ నగదు బహుమతులు లేదా ఉద్యోగ అవకాశాలను పొందే  ఎస్ఎంఎస్, లెటర్స్, ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్ లేదా ప్రకటన నుంచి జాగ్రత్తగా ఉండండి. వీరికి మీ బ్యాంక్ వివరాలు పంచుకోవద్దు. 
  • SBI వినియోగదారులు తమ బ్యాంక్ సంబంధించిన పాస్ వర్డ్ లను ఎప్పటికప్పుడు మార్చాలని సూచించింది. 
  • ఖాతాదారులు ఇంటర్నెట్ శోధన ఫలితాల నుంచి కనుగొనబడిన ఏ బ్యాంక్ సమాచారం మీద ఆధారపడవద్దు. ఏదైన కాంటాక్ట్ నెంబర్ మరియు ఇతర వివరాలకు బ్యాంక్ వెబ్ సైట్ ను మాత్రమే ఉపయోగించాలి. 
  • SBI ప్రతినిధులు తమ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం పాస్ వర్డ్ లేదా ఓటీపీ కోసం ఇ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ పంపరు. 
  • ఏదైనా నకిలీ పథకాల గురించి మీ సమీప పోలీస్ స్టేషన్ లో మరియు మీ సమీప SBI బ్రాంచ్ లో ఫిర్యాదు చేయాలి. 

Leave a Comment