ఐపీఎల్ 2020 షెడ్యుల్ విడుదల

ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఐపీఎల్ 13వ సీజన్ ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ ఆదివారం విడుదలైంది. యూఏఈ వేదికగా జరగనున్న డ్రీమ్ 11 ఐపీఎల్ తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ చైన్నె మధ్య జరగనుంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్ నవంబర్ 3 వరకు కొనసాగుతుంది. 

కొత్త షెడ్యూల్ ప్రకారం, ఐపీఎల్ 13వ సీజన్ మొత్తం 10 డబుల్ హెడ్డర్లు ఆడాల్సి వస్తున్నాయి. రెండు మ్యాచులు ఆడిన రోజున మొదటి మ్యాచ్ భారత సమయం ప్రకారం 3.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక రెండో మ్యాచ్ భారత సమయం ప్రకారం 7.30 గంటలకు మొదలవుతుంది. లీగ్ దశలో గరిష్టంగా 24 మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతాయి. ఇవే కాకుండా అబుదాబిలో 20, షార్జాలో 12 మ్యాచులు ఆడనున్నారు. అయితే ప్లే ఆఫ్ మరియు ఫైనల్ మ్యాచ్ లకు మైదానాలు ఎంపిక చేయలేదు. 

 

DOWNLOAD APP

పూర్తి మ్యాచుల వివరాలుClick Here

Leave a Comment