స్వదేశీ యాప్ల కోసం మోడీ సవాల్..‘ఆత్మ నిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’ లాంచ్..!

దేశ సార్వభౌమాధికారం, భద్రత దృష్ట్యా 59 చైనీస్ యాప్లను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. చైనీస్ యాప్ల నిషేధం తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో ముందడుగు వేశారు. ప్రపంచ స్థాయిలో ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్లను రూపొందించేందుకు ఆత్మ నిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రకటించారు. దేశంలో ఉన్న సాఫ్టవేర్ టేకీలు, స్టార్ట్ అప్ కమ్యూనిటీల కోసం ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ‘ఆత్మనిర్భర్ యాప్ ఎకోసిస్టం’ను రూపొందించాల్సిన అవసరం ఉందని మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ప్రస్తుతం దేశం మొత్తం ఆత్మనిర్భర్ భారత్ ను రూపొందించాడానికి కృషి చేస్తోంది. వారి ప్రయత్నాలకు దిశానిర్ధేశం చేయడానికి అవకాశం ఉంది.  ప్రపంచ మార్కెట్ తో పోటీపడే యాప్లను తయారు చేసేందుకు వారి ప్రతిభను ప్రోత్సహించడానికి మార్గదర్శకం చేయాలి. 

భారత దేశం యొక్క స్టార్ట్ అప్ మరియు టెక్ కమ్యూనిటీ ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అటల్ ఇన్నోవేషన్ మిషన్ తో ఆత్మనిర్భర్ భారత్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ తో ముందుకు వస్తోంది.  యాప్ల కేటగిరీలను బట్టి ప్రైజ్ మనీ రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఇ-లెర్నింగ్, వర్క-ఫ్రమ్ హోమ్, గేమింగ్, బిజినెస్, ఎంటర్ టైన్మెంట్, ఆఫీస్, యుటిలిటీస్ మరియు సోషల్ నెట్ వర్కింగ్ విభాగాలలో ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో పాల్గొనవచ్చు. దీని గురించి పూర్తి వివరాల కోసం ‘innovate.mygov.in’ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. దరఖాస్తులు జూలై 18, 2020 వరకు నమోదు చేయాలి. 

 

Leave a Comment