దీపావళి పండుగకు వింత ఆచారం.. ఆవుపేడతో కొట్టుకుంటారు.. ఎక్కడో తెలుసా?

పండుగల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు ఉంటాయి. అదేధంగా కర్ణాటక-తమిళనాడు బార్డర్ లో ఉన్న గుమటాపుర గ్రామంలో దీపావళి పండుగ ముగింపు సందర్భంగా ఒక వింత ఆచారం ఉంది. మగవాళ్లంతా ఒకరికొకరు ఆవు పేడతో కొట్టుకుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో దూరం నుంచి ప్రజలు వస్తారు. ఆ వేడుక చిన్న పాటి యుద్ధంలా తలపిస్తుంది. కానీ చాలా సరదాగా సాగుతుంటుంది.

ఆలయంలో పూజారి ఆశీర్వాదం తీసుకునే ముందు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆవు పేడను ట్రాక్టర్ల సాయంతో దేవాలయానికి తరలిస్తారు. తర్వాత అబ్బాయిలంతా కార్యక్రమం కోసం బాణసంచాను కూడా సిద్ధం చేసుకుంటారు. కార్యక్రమంలో భాగంగా చిన్న పెద్ద తేడా లేకుండా మగవాళ్లంతా ఒకరినొకరు ఆవుపేడతో కొట్టుకుంటారు. ఆరోగ్య ప్రయోజనం నిమిత్తం ఇలా చేస్తుంటామని గ్రామస్థులు చెబుతున్నారు. ఆవుపేడతో ఇలా కొట్టించుకుంటే ఏదైన వ్యాధి ఉన్న అది త్వరగా తగ్గిపోతుందని వారి నమ్ముతారు. 

Leave a Comment