ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లను అడ్డుకోవాలి..

ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ 

విజయవాడ : ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా పోరాడాలని ఎంఐఎం అధ్యక్షడు అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. అల్ మైనారిటీ అసోసియేషన్ నెట్ వర్క్ మరియు ముస్లిం ముత్తాహీదా మిజాజ్ ఆధ్వర్యంలో  మంగళవారం విజయవాడంలని కుమర్మరి పాలెం ఈద్గాలో జరిగిన బహినంగా సభలో అసదుద్దీన్ మాట్లాడారు. ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్సీ, సీఏఏ విషయంలో బీజేపీపై మరింత ఘాటుగా విమర్శలు చేశారు. దేశంలో ఎంతో మంది ప్రధానులు పరిపాలన చేశారని, కానీ ప్రస్తుత ప్రధాన మంత్రి మోడీ ఒక నియంత లాగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కేరళ తరహా స్టే తో ncr, npr  అడ్డుకోవాలని కోరారు. వైస్ జగన్మోహన్ రెడ్డి 124 జీవో కూడా తప్పుల తడఖా అన్నారు. దానిని తయారు చేసిన అధికారి మోడీ ఏజెంట్ అన్నారు. చంద్రబాబుకు అధికారం లేకపోయినా ఎందుకని మోడీ కి భయపడుతున్నారో అర్థం కాలేదన్నారు. NCR NPR కు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పోరాటం చేయాలన్నారు. అస్సాం రాష్ట్రంలో భారతీయతను కోల్పోయిన 5లక్షల ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఎన్పీఆర్ ను ఏప్రిల్ 1 నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిదని, ఎన్పీఆర్, ఎన్ఆర్సీను తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకించారని, ఏపీ ముఖ్యమంత్రి కూడా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. 2015 జరిగిన ప్రజా గణాంకాల నమోదులో 40 శాతం మంది వద్ద జనన ధ్రువీకరణ పత్రాలు లేవన్నారు. ఇప్పటికిప్పుడు తమ ధ్రువీకరణ పత్రాలు కావాలంటే పేదవాడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు, NCR NPR వలన 8 కోట్ల మంది భారతీయుత ను కోల్పోతారన్నారు. NCR NPRలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా  జైల్ భరో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

Leave a Comment