ఏపీ ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ జస్టిస్ వి.కనగరాజ్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. కొత్త కమిషనర్ ను నియమిస్తూ జీవో 619 విడుదల చేసింది. విజయవాడలోని ఆర్ం అండ్ బి భవన్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మిషనర్ హోదాలో రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం జస్టిస్ కనగరాజ్ నియామకం జరిగింది. కనగరాజ్ తమిళనాడు రాష్ట్ర మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా దాదాపు తొమ్మిది సంవత్సరాలు పని చేశారు. 

రాష్ట్ర గవర్నర్ బిస్వాభూషన్ హరిచందన్ ను శనివారం ఉదయం రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నూతనంగా భాద్యతలు స్వీకరించిచారు. 

అత్యంత నిజాయితీ పరుడు.. 

జస్టిస్ వి.కానగరాజ్ అపారమైన విజ్ఞానం ఉన్న న్యాయ కోవిదులు.  అత్యంత నిజాయతీ పరులు.పలు చారిత్రాత్మక తీర్పులు ఇచ్చినవారుగా ప్రసిద్ధులు. 

 2000 సంవత్సరంలో తమిళనాడులోని ధర్మపురి బస్సు దహనం కేసులో అప్పటి అధికార AIADMK పార్టీ కి చెందిన ముగ్గురుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించి సంచలన తీర్పు ఇచ్చారు. 

విద్యార్థినులతో వెళుతున్న బస్సు పైన aiadmk నేతలూ కార్యకర్తలు పెట్రోలు బాంబులు విసరడంతో చాలా మంది బాలికలు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.  ఆ బస్సు పూర్తీగా కాలిపోయింది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఏమాత్రం వెరవక, బెదరక దోషులకు శిక్షపడేలా జస్టిస్ కానగరాజ్ గారు వ్యవహరించారు. కేవలం జస్టిస్ కానగరాజ్ గారి కృషి వల్లే ఈ కేసులో దోషులు తప్పించుకోలేకపోయారని తమిళనాడు వాసులు భావిస్తుంటారు

 

Leave a Comment