ఏపీలో స్థానిక ఎన్నికల నగారా..

ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ అధికారులు విడుదల చేశారు. మూడు దఫాలుగా స్థానిక ఎన్నికలు జరగనున్నట్లు స్పష్టం చేశారు. 660 జడ్పీటీసీ, 9,639 ఎంపీటీసీలకు మొదటి దశలో ఎన్నికలు జరగనుండగా.. పంచాయతీలకు మరో దశలో ఎన్నికలకు నిర్వహించనున్నారు. ఇక మూడో దశలో మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయి. 

స్థానిక ఎన్నికల షెడ్యూల్ వివరాలు..

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు..

  • మార్చి 7 – నోటిఫికేషన్ విడుదల
  • మార్చి 9-11 వరు నామినేషన్ల స్వీకరణ
  • మార్చి 12- నామినేషన్ల పరిశీలన
  • మార్చి 14 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
  • మార్చి 21- ఎన్నికల పోలింగ్
  • మార్చి 24 – ఓట్ల లెక్కింపు

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

  • మార్చి 9 – నోటిఫికేషన్ విడుదల
  • మార్చి 11-13 నామినేషన్ల స్వీకరణ
  • మార్చి 14 – నామినేషన్ల పరిశీలన
  • మార్చి 16 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
  • మార్చి 23 – ఎన్నికల పోలింగ్
  • మార్చి 27 – ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్

  • మార్చి 15 – నోటిఫికేషన్ విడుదల
  • మార్చి 17-19 నామినేషన్ల స్వీకరణ
  • మార్చి 20 – నామినేషన్ల పరిశీలన
  • మార్చి 22 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
  • మార్చి 27 – ఎన్నికల పోలింగ్
  • మార్చి 27 – ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్

  • మార్చి 17 – నోటిఫికేషన్ విడుదల
  • మార్చి 19-21 నామినేషన్ల స్వీకరణ
  • మార్చి 22 – నామినేషన్ల పరిశీలన
  • మార్చి 24 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
  • మార్చి 29 – ఎన్నికల పోలింగ్
  • మార్చి 29 – ఓట్ల లెక్కింపు

Leave a Comment