ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి..!

కరోనా వైరస్ కు కృష్ణపట్నంలో ఆనందయ్య అందించే మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పీ, ఎల్, ఎఫ్ మందులను రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అయితే కంట్లో వేసే ‘కే’ రకం మందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు..

కంట్లో వేసే మందుకు సంబంధించి రిపోర్టు రాలేదు. దీంతో ఈ మందుకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. కంట్లో వేసే మందుకు సంబంధించి నివేదిర రావడానికి మరో రెండు నుంచి మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ నివేదిక పరిశీలించిన అనంతరం కంట్లో వేసే మందుపై నిర్ణయం తీసుకోనుంది. 

అయితే డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే ఆనందయ్య మందును వాడుకోవచ్చని చెప్పింది. ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందని నిర్ధారణ కాలేదని, ఆనందయ్య మందుల వల్ల హానీ కూడా లేదని తేలింది.. అయితే మందులు తీసుకునేందుకు కరోనా రోగులు కృష్ణపట్నంకు రావద్దని, వారి కుటుంబ సభ్యులు వచ్చి మందు తీసుకెళ్లాలని కోరింది.  

 

Leave a Comment