యాంటీ ఇండియా కంటెంట్.. ఆ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం..!

యాంటీ ఇండియా కంటెంట్, ఫేక్ కంటెంట్ వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. 8 ఛానెళ్లపై నిషేధం విధించింది. నిషేధానికి గురైన ఛానెళ్లలలో 7 ఇండియన్ ఛానెళ్లు, ఒక పాకిస్తానీ ఛానెల్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ప్రకారం ఈ ఛానెళ్లపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది.. 

ఈ యూట్యూబ్ ఛానెళ్లు దేశంలో మత సామరస్యానికి భంగం కలిగించేలా కంటెంట్ వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ ఛానెళ్లు మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్నట్లే పేర్కొంద. ఈ ఛానెళ్లు ప్రజలను తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాప్తి చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ ఛానెళ్ల ద్వారా దేశ సామరస్యానికి, సమగ్రతకు, భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండటంతో వీటిపై నిషేధం విధించింది.. 

నిషేధానికి గురైన ఛానెళ్లు ఇవే..

  • లోక్ తండ్ర టీవీ –  దీనికి 12.90 లక్షల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.  
  • యు&వీ టీవీ – 10.20 లక్షల సబ్ స్క్రైబర్లు
  • ఏఎం రజ్వీ – 95,900 సబ్ స్క్రైబర్లు
  • గౌరవ్ శాలి పవన్ మిథిలాంచల్ – 7 లక్షలు
  • సీ టాప్5 టీహెచ్ – 33.50 లక్షలు
  • సర్కారీ అప్ డేట్ – 80,900
  • సబ్ కుచ్ దేఖో – 19..40 లక్షలు
  • న్యూస్ కీ దునియా(పాకిస్తానీ ఛానెల్) – 97 వేలు

 

Leave a Comment