‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో వీడియో..!

దర్శక ధీరుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కు సంబంధించిన ఓ వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో బ్రిటీష్ సైన్యంతో పోరాటాలను చిత్రీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. చాలా రోజులుగా నైట్ షూట్ తీస్తున్నామని, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని ఆర్ఆర్ఆర్ టీమ్ తెలిపింది. దీన్ని థియేటర్ లో చూసేటప్పుడు మరో లెవల్లో ఉంటుందని ఆ యూనిట్ సభ్యుడు ఒకరు తెలిపారు.

కాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఎన్టీఆర్ కు సంబంధించిన ‘భీమ్ ఫర్ రామరాజు’ అంటూ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ రికార్డులు బ్రేక్ చేస్తూ ఎన్నో విమర్శలను సైతం తెచ్చిపెట్టింది. ఇక అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ ను ఇంతకు ముందే పరిచయం చేసింది. 

 

Leave a Comment