రాష్ట్రానికి అమరాతవే రాజధాని : పవన్‌

రాయపూడి : రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్రం ఇష్టమేననీ, ఆ విషయంతో తానూ ఏకీభవిస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శనివారం ఆయన అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడి రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వపన్ కల్యాణ్ మాట్లాడుతూ రాజధాని అమరావతిలోనే ఉండేలా పోరాటం చేస్తానన్నారు.రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రైతులు భూములిచ్చారన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. రాష్ట్రానికి అమరావతే రాజధాని అని నిర్ణయం తీసేసుకున్నామన్నారు. 

వైసీపీ నేతలకు క్విడ్‌ప్రోకో అలవాటే !  

రాజధాని తరలింపు అంశాన్ని జగన్‌ ఎన్నికల ముందే చెప్పి ఉండాల్సిందని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసిన వాళ్లను కావాలంటే శిక్షించండని అన్నారు. ప్రజలను రోడ్లమీదకు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేవి అసలు పార్టీలే కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. నాలుగైదు భవనాలు కట్టినంత మాత్రాన అభివృద్ధి కావన్నారు. వైసీపీ నేతలకు క్విడ్‌ప్రోకో అలవాటే అన్నారు.  రైతులు టీడీపీకి భూములు ఇవ్వలేదని, ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్రాల సమగ్ర అభివృద్ధిని కోరుకుంటున్నామన్నారు. ఒక్క కోర్టు వచ్చినంత మాత్రాన అభివృద్ధి జరగదన్నారు.

పెన్ను పోటుతో రాజధాని మార్పు !

విశాఖలో మళ్లీ భూసమీకరణ చేస్తున్నారని, అక్కడి రైతులు భూసమీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇక్కడ ఇన్ని వేల ఎకరాలు ఉంటే విశాఖలో మళ్లీ భూ సమీకరణ ఎందుకని ప్రశ్నించారు. టీడీపీతో వారికి గొడవ ఉంటే వారితో పెట్టుకోవాలని, రాజధాని మార్పు తగదదని చెప్పారు. పెన్నుపోటుతో రాజధాని మార్పు చేస్తున్నారన్నారు.  40 మందికి పైగా రైతులు చనిపోయారని, ఇవి ప్రభుత్వ హత్యలేనని తెలిపారు. అమరావతి రైతుల ఉద్యమానికి తర మద్దతు ఎప్పటికీ ఉంటుందని పవన్‌ అన్నారు.

Leave a Comment