బెంగాల్ లో నివసించే బంగ్లాదేశీయులందరూ భారత పౌరులే..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత

పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్ లో స్థిరపడి ఎన్నికల సమయంలో ఓటేస్తున్న వారందరూ ఈ దేశ పౌరులేనని, అటువంటి వారు తిరిగి పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని కలియాఘంజ్ ప్రాంతంలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన అల్లర్లు దారుణమని, అటువంటి ఘటనలను పశ్చిమ బెంగాల్ లో జరగనివ్వమని అన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారంతా భారత పౌరులేనని, వారికి ఇప్పటికే పౌరసత్వం ఉందని ఆమె చెప్పారు. మీరు ఎన్నికల్లో ఓట్లేసి ప్రధాని, ముఖ్యమంత్రులను ఎన్నుకుంటున్నారని, కాని కేంద్రం మీరు భారత పౌరులు కాదని చెబుతోందని, వారు చెబుతున్న మాటలను వినవద్దని వారిని ఉద్దేశించి మమత వ్యాఖ్యానించారు. కాగా, మమత ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీని విమర్శించింది.

Leave a Comment