కరోనా నుంచి కోలుకుంటున్న నటీ..

Coronavirus తో బాధపడుతున్న బాలీవుడ్ నటీ Zoa Morani మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ కానుంది. ఈ విషయాన్ని జోవా తన ఇన్ స్టాగ్రామ్ లైవ్ చాట్ లో వెల్లడించింది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పింది. కరోనా నుంచి తాను ఎలా కోలుకుంటున్నారో వివరించింది. ఎప్పుడు డిశ్చార్జ్ అవుతున్నావని హీరో Varun Dhavan అడగ్గా, రేపు లేదా ఆ మరుసటి రోజు ఇంటికి వెళ్తానని అనుకుంటున్నానని, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని సమాధానం ఇచ్చింది. 

తన ఆరోగ్యం ఆస్పత్రిలో చేరిన రెండో రోజు నుంచే మెరుగుడటం జరిగిందని, ఇప్పుడు తన ఆరోగ్యం 40 రెట్లు మెరుగుపడిందని వెల్లడించింది. కరోనా వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డానని, అయితే ఆస్పత్రిలో చేరిన రెండు రోజులకే ఆ సమస్య తగ్గిందని చెప్పింది. ప్రస్తుతం కాస్తా జ్వరం, అలసటగా ఉన్నప్పటికీ..ముందుకంటే ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపింది. 

కరోనా వల్ల మొదట నాకు తెలికపాటి జ్వరం, శ్వాస ఇబ్బందులు వచ్చాయని, అయితే అవి భరించేంత స్థాయిలో ఉన్నప్పుడే ఆస్పత్రిలో చేరానని చెప్పింది. తాను ఆస్పత్రి చేరడం మంచిదైందని, ఇప్పుడు కోలుకుంటున్నాననే భావన కలిగిందని పేర్కొంది. 

తన ఇంట్లో మొదట కరోనా లక్షణాలు కనిపించిన వ్యక్తి తన సోదరి Shaja అని, తన తల్లి జరకి కూడా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని తెలిపింది. తన సోదరికి రెండు సార్లు పరీక్షించగా నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేసినట్లు జోవా వెల్లడించింది. 

Leave a Comment