నటి మీనా భర్త హఠాన్మరణం.. పావురాల వ్యర్థాలే కారణమా?

సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్(48) మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందాడు.. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడిన ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.. విద్యాసాగర్ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశానవాటికలో జరగనున్నాయి. విద్యాసాగర్ మృతి పట్ల పలువురు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

 బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్ తో 2009లో మీనా వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు నైనిక.. నైనిక ఇప్పుటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్ హీరోగా నటించిన ‘తేరీ’, అరవింద్ స్వామి ‘భాస్కర్ ఓరు రాస్కెల్’ సినిమాల్లో నైనిక బాల నటిగా నటించింది.  

కాగా.. విద్యాసాగర్ మృతికి సంబంధించి తమిళనాడు స్థానిక పత్రికల్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని ఎక్కువగా పీల్చడం వల్లే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని పేర్కొంటున్నాయి. మీనా ఇంటికి అతి సమీపంలో పావురాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయని, వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్ల ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని, గత కొంత కాలంగా దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారని పత్రికల్లో కథనాలు ప్రచూరితమయ్యాయి. 

 

 

 

Leave a Comment