కరోనాపై చిరు, నాగ్ పాట హల్ చల్

కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ అమలులో ఉంది. దీంతో రెక్కాడితే కాని డొక్కాడని కార్మికులు, రోజువారి కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని అదుకునేందుకు ప్రభుత్వాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. 

ప్రభుత్వాలకు అండగా టాలీవుడ్ స్టార్లు కదం తొక్కారు. సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు భారీ విరాళాలు ఇస్తున్నారు. మరోె వైపు ప్రజలను చైతన్యం చేసేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా సంగీత దర్శకుడు కోటీ ఓ పాటను రూపొందించగా, చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ పాలుపంచుకున్నారు. కరోనా నుంచి అప్రమత్తంగా ఎలా ఉండాలని వారు పాడిన ఈ పాల నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికులను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో తెలుగు సినీ పరిశ్రమ ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’(సిసిసి) ని ఏర్పాటు చేసింది. ఈ సంస్థకి చైర్మన్ గా చిరంజీవి ఉన్నారు. ఈ ఛారిటీకి సినీ ప్రముఖుల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఇప్పటికే పలువురు నటులు సీసీసీకి విరాళాలు ప్రకటించగా, తాజాగా హీరో ప్రభాస్ రూ.50 లక్షలు, నటుడు బ్రహ్మాజీ రూ.75వేలు విరాళం ప్రకటించారు. 

Leave a Comment