వాట్సాప్ స్టేటస్ వీడియో పరిమితి 15 సెకన్లకు కుదింపు..

భారత దేశంలో ఇంటర్నెట్ నెట్ వర్క్ లపై ఒత్తిడిని తగ్గించడానికి, ఫేస్ బుక్ యాజమాన్యంలోని ఇన్ స్టంట్ మెసేజింగ్ సర్వీస్ స్టేటస్ వీడియో పరిమితిని 30 సెకన్ల నుంచి 15 సెకన్లకు తగ్గించింది. భారత దేశంలో లక్షలాది మంది సంగీతం మరియు టిక్ టాక్ వీడియోలను ఈ స్టేటస్ ద్వారా పంచుకుంటుంటారు. ఈ అప్ డేట్ ను WABetainfo ట్విటర్ వేదికగా ప్రకటించింది. అయితే లాక్ డౌన్ వరకు మాత్రమే ఈ నిబంధన ఉంటుందని పేర్కొంది. 

వాట్సాప్ స్టేటస్ లో 16 సెకన్ల కంటే ఎక్కువ ఉన్న వీడియోలను ఇక నుంచి పంపలేరు. 15 సెకన్ల వ్యవధి ఉన్న వీడియోలను మాత్రమే పంచుకోగలరు. సర్వర్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లో ట్రాఫిక్ నియంత్రణకు భారత దేశంలో దీనిని అమలు చేస్తున్నారు. భారత దేశంలో 400 మిలియన్లకు పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు. 

పేస్ బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్ ఫాం వినియోగదారులకు వీడియోలను 15 సెకన్లకు కుదించి పోస్ట్ చేయాలని కోరుతోంది. 

వాట్సాప్ ప్రారంభ సమయంలో 90 సెకన్ల నుంచి 3 నిమిషాల వీడియోలను షేర్ చేసేందుకు అనుమతించింది. వీడియో 16 ఎంబీ కంటే పెద్దదిగా ఉంటే దానిని కత్తిరించే ఎంపికను ఇచ్చింది. తరువాత పరిమితిని 30 సెకన్లకు తగ్గించారు. 

డేటా మరియు కన్సల్టింగ్ సంస్థ కాంతర్ అధ్యయనం ప్రకారం వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం వాడకం పెరిగింది. 

 

Leave a Comment