రేపు సూర్యగ్రహణం..

విశ్వవ్యాప్తంగా ఆదివారం ఖగోళంలో అద్భుతం జరగబోతోంది. పూర్తి స్థాయి వలయాకార సూర్య గ్రహణం ఏర్పడబోతుంది. ఈ సూర్యగ్రహణం విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16  నుంచి మధ్యామ్నం 3.04 వరకు ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో పాటు ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్రికా మొదలగు ప్రాంతాల్లో కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తుంది. డెహ్రాడూన్(ఉత్తరాఖండ్)లో సంపూర్ణంగా ఈ గ్రహణం కనిపిస్తుంది. 

ఇక మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఈ గ్రహణాన్ని మొదట చూస్తారు. రేపు సూర్య గ్రహణం కారణంగా అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడతాయి. ఆంధ్రప్రదేశ్ లో రేపు ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం, తెలంగాణలో  10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు 51 శాతం గ్రహణం ఉంటుంది. 

తెలంగాణలో

గ్రహణ ఆరంభకాలం : ఉదయం. 10.14

గ్రహణ మధ్యకాలం : ఉదయం. 11.55 

గ్రహణ అంత్యకాలం : మధ్యాహ్నం . 1.44 

గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్ లో 

గ్రహణ ఆరంభకాలం : ఉదయం. 10.23 

గ్రహణ మధ్యకాలం : మధ్యాహ్నం. 12.05

గ్రహణ అంత్యకాలం : మధ్యాహ్నం . 1.51

గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలు

ఎవరు చూడకూడదు…

ఈ సూర్య గ్రహణాన్ని మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాల వారు అసలు చూడకూడదు. 

గ్రహణ నియమాలు  

గ్రహణం రోజు అనగా ఉదయం 6 గంటల వరకు సామాన్య మానవులు అందరూ అన్నపానాదులు ముగించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం  ఉదయం 8 గంటల వరకు తినవచ్చు. అది కూడా అల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ గ్రహణం మిధున రాశి వారు  మృగశిర, ఆరుద్ర  పునర్వసు  నక్షత్ర జాతకుల వారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ గ్రహణం చూడరాదు. గ్రహణ పట్టు, మధ్య , విడుపు స్నానాలు ఆచరించే వారు యాధావిధిగా స్నానం ఆచరించి, మంత్రానుష్టానములను నిర్వహించుకోవచ్చు. 

ఏ మంత్ర జపం చేయాలి..

గ్రహణం సమయంలో ఎవరి నక్షత్ర జపం వారు చేసుకోవచ్చును. లేదా మీకు ఏదైనా మంత్రానుష్టానం ఉంటే ఆ మంత్రం జపం చేసుకోవచ్చు. లేదా సూర్య గాయత్రి మంత్రం జపం చేసుకోవచ్చు.

 

Leave a Comment