అవమానంతో 17 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి..!

అవమానన్నా చాలా మంది తట్టుకోలేరు. అవమానభారంతో కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. కానీ ఓ వ్యక్తి తనకు అవమానం జరగడంతో గత 17 ఏళ్లుగా జనాలకు దూరంగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు. అరంతోడ్ గ్రామం నుంచి అద్దేల్ నెక్కారే అడవిలో ఓ గుడిసేలో ఒకప్పటీ ప్రీమియం పద్మినీ కారులో 56 ఏళ్ల చంద్రశేఖర్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడు ఒంటరిగా అడవిలో జీవించడానికి కారణం ఏమంటే.. 

కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లా నెక్రల్ కెమ్రాజీ అనే గ్రామంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. గ్రామంలో అతనికి 1.5 ఎకరాల భూమి ఉండేది. 2003 సంవత్సరంలో సాగు నిమిత్తం ఆయన స్థానిక సహకార బ్యాంకు నుంచి రూ.40 వేలు రుణం తీసుకున్నాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల బ్యాంకు అప్పును తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో బ్యాంక్ అధికారులు ఆయన పొలాన్ని వేలం వేశారు.

దీంతో చంద్రశేఖర్ మనస్తానాకి గురై గ్రామంలో ఉండలేకపోయాడు. తనకు ఇష్టమైన కారు ‘ప్రీమియమ్ పద్మినీ’ని తీసుకుని తన సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. ఈక్రమంతో తన సోదరితో విభేదాలు వచ్చాయి. అయితే అవమానంతో సొంత గ్రామానికి వెళ్లలేదు. తీవ్ర అసంతృప్తితో సుల్యాకు 15 కిలో మీటర్ల దూరంలో అద్దెల్-నెక్కారే అడవిలో వెళ్లిపోయాడు.

అంతే అక్కడి నుంచి తిరిగి జానాల్లోకి రాలేదు. తన జీవితం మొత్తం అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అడవిలో దొరికే పండ్లు తింటూ.. జలపాతాల వద్ద స్నానం చేస్తూ అడవిలోనే జీవిస్తున్నాడు. ఆహారం కోసం బుట్టలు చేసి వాటిని సమీపంలోని గ్రామాల్లో అమ్మి వచ్చి వాటి ద్వారా తన జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. ఓ చిన్నపాటి గుడిసే వేసుకుని అందులో తన ప్రియమైన కారులో జీవనం సాగిస్తున్నాడు. ఆ గుడిసేలో అతని వద్ద ఓ రేడియో, ఒక పాత సైకిల్ మాత్రమే ఉన్నాయి.  అలా 17 ఏళ్లు అడవిలోనే జీవిస్తున్నాడు. 

ఇటీవల విషయం తెలిసి జిల్లా కలెక్టర్ ఆయన్ను కలిసి సొంత ఇల్లు కట్టిస్తానని చెప్పారు. అయినా చంద్రశేఖర్ అంగీకరించలేదు. తనకు అడవిలోనే బాగుందని చెప్పాడు. తనకు జంతువులు కూడా ఎలాంటి హానీ చేయవని అన్నాడు. అటవీశాఖ అధికారులు కూడా చంద్రశేఖర్ వల్ల అటవీకి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. దీంతో చంద్రశేఖర్ 17 ఏళ్లుగా అడవిలో ఉంటూ వార్తల్లోకెక్కాడు..   

 

Leave a Comment