9 నెలల క్రితం అదృశ్యమైన మహిళా కానిస్టేబుల్.. గుడి ముందు పూలు అమ్ముతూ కనిపించింది..!

9 నెలల క్రితం సీఐడీ మహిళా కానిస్టేబుల్ అదృశ్యమైంది. ఆమె కిడ్నాప్ కు గురైందా లేదా ఎక్కడికైనా వెళ్లిపోయిందా అనేదానిపై ఎవరికీ తెలియదు. అయితే ఆమె సడెన్ గా ఓ  గుడి వద్ద పూలు అమ్ముకుంటూ కనిపించింది. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు చత్తీస్ ఘర్ లోని రాయిగఢ్ లో అంజనా సాహిస్ అనే మహిళ సీఐడీ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేసేవారు. 9 నెలల క్రితం ఆమెను రాయ్ పూర్ కి బదిలీ చేశారు. ఈక్రమంలో ఓరోజు అంచనా సడెన్ గా కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలీస్ అధికారులకు ఆమె గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు. 

ఈక్రమంలో అధికారులు ఆమె బ్యాంక్ లావాదేవీలను పరిశీలించారు. బృందావన్ లోని ఓ ఏటీఎంలో నగదు తీసుకున్నట్లు గుర్తించారు. అంజనా బృందావన్ లోని కృష్ణుడి గుడి బయట పూలు అమ్ముతూ కనిపించింది. ఆమెను అలా చూసిన పోలీసులు షాకయ్యారు. పోలీసులు ఆమెను వెనక్కు తీసుకురావాలని ఎంత ప్రయత్నించినా ఆమె నిరాకరించింది. తాను ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతానని చెప్పింది. 

అయితే ఆమె ఇలా ఎందుకు అయిందో తెలుసుకునేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొందరి పై అధికారుల తీరువల్ల తనకు విసుగొచ్చి వెళ్లిపోయినట్లు ఆమె తెలిపింది. ఆ అధికారులు ఎవరు, వారి వల్ల ఎటువంటి ఇబ్బంది కలిగింది అనే వివరాలను అంజనా వెల్లడించలేదు. 

 

Leave a Comment