గాలిలో పుట్టిన పిల్లోడు.. బంపర్ ఆఫర్ కొట్టేశాడు..

విమానంలో ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ గర్భిణీ ప్రసవించింది. తల్లిబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు ఇండిగో సంస్థ పేర్కొంది. ఇండిగో సంస్థకు చెందిన విమానం బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరింది. ఈ విమానంలో నిండు గర్భిణీ ప్రయాణిస్తోంది. అయితే మార్గమధ్యంలో ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. 

సరిగ్గా అదే సమయంలో విమానంలో గైనకాలజిస్ట్ అందుబాటులో ఉండటంతో ఇండిగో సిబ్బందితో కలిసి మహిళకు డెలివరీ చేశారు. అనంతరం విమానం బెంగళూరులో ల్యాండ్ అయిన వెంటనే తల్లీబిడ్డకు ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా బెంగళూరు ఎయిర్ పోర్టులో తల్లీబిడ్డలకు గొప్ప స్వాగతం పలికారు. కాగా విమానంలో పుట్టిన బిడ్డకు ఇండిగో సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. విమానంలో పుట్టాడు కాబట్టి అతనికి జీవితాంతం ఫ్లైట్ టికెట్ ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

Leave a Comment