‘జగనన్న విద్యాకానుక’ ప్రారంభించిన సీఎం జగన్

దేశంలోనే తొలిసారిగా ఏపీలో మరో ప్రతిష్టాత్మక పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. క్రిష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని గురువారం ప్రారంభించారు. రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను ఈ కిట్ల రూపంలో అందించనున్నారు. పిల్లలను బడిలో చేర్చే సమయంలో ఇబ్బంది పడే పేదింటి అక్కచెల్లెమ్మలకు విముక్తి కలిగించడంతో పాటు, పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ లను తగ్గిస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా జగనన్న విద్యా కానుకను ప్రభుత్వం అమలు చేస్తుంది. 

విద్యాకానుకలో ఏమున్నాయంటే..

జగనన్న విద్యాకానుక కిట్ లో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలతో ఇతర వస్తువులను పొందుపరిచారు. ఈ కిట్లలో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ ఉంటాయి. బాలురకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందించారు. కోవిడ్ నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా పంపిణీ చేశారు. యూనిఫాం కుట్టించుకోవడానికి మూడ జతలకు రూ.120 చొప్పున తల్లుల అకౌంట్ కు నేరుగా జమ చేస్తున్నారు. 

 

Leave a Comment