మునగాకుతో ఆ సమస్యలు కూడా దూరం..

మునగాకులో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి.ఇది శృంగార సమస్యలనే కాకుండా ఇతర సమస్యలనూ కూడా దూరం చేస్తుంది. ఈ ఆకులతో తయారు చేసిన టీతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది కిడ్నీలో రాళ్ల సమస్యను తగ్గించడమే కాకుండా కొవ్వును కూడా ఇట్టే తగ్గిస్తుంది. మన వంటల్లో ఎక్కువగా మునగకాడలను ఉపయోగిస్తారు. అయితే ఈ కాడలతోనే కాకుండా మునగ ఆకును కూడా వంటల్లో వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కాలేయంలో చేరిన విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇంకా మూత్రాశయంలో రాళ్లను కరిగిస్తుంది. 

moringa powder

మునగాకు పౌడర్ టీ..

మునగాకును పౌడర్ చేసి టీ గా వాడుతున్నారు. ఈ పౌడర్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ ఆకును మిరాకిల్ హెర్బ్, సూపర్ ఫుడ్ గా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు దీనిని ఆహారంలో ఉపయోగిస్తున్నారు. 

ప్రయోజనాలు..

  • మునగాకులో అనేక ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. ఇది కొవ్వును కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది. మునగాకు పౌడర్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మునగాకు టీ బరువు తగ్గేందుు బాగా సహాయపడుతుంది. కొవ్వు నిల్వకు బదులుగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆకులలో తక్కువ కొవ్వు, అధిక పోషక విలువలు ఉన్నాయి. ఈ కారణంగా త్వరగా బరువు తగ్గుతారు. 
  • అంతే కాకుండా మునగాకు టీ రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించే క్వెర్సెటిన్ ఇందులో అధికంగా లభిస్తుంది. అదనంగా, ఇందులోని యాంటీ ఆక్సీకరణ సామర్థ్యాల కారణంగా బీపీ రోగులకు మంట నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.  
  • మునగాకులు డయాబెటీస్ తో బాధపడే వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కాఫీలో కూడా ఉంటుంది. దీంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇందులో విటమిన్ సీ అధికంగా ఉండటంతో టైప్-2 డయాబెటీస్ రోగులకు రక్తంలో చక్కెర, రక్తపోటును తగ్గిస్తుందని తేలింది. 
  • మునగాకు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో తోడ్పడుతుంది. కాబట్టి గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా ఈ టీని తాగడం అలవాటు చేసుకోవాలి. 
  • మునగాకు పొడి చర్మం మరియు జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు విషాన్ని నివారించడానికి మరియు చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగపడతాయి. 
  • మునగాకులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని పోషక పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఉబ్బసం లక్షణాలను తగ్గించడం నుంచి తల్లిలో పాల ఉత్పత్తిని పెంచడం వరకూ ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందని పరీశోధకులు చెబుతున్నారు. 

మునగాకు పౌడర్ తయారీ విధానం..

మునగాకు పౌడర్ ప్రస్తుతం ఆన్ లైన్ లో, దుకాణాల్లో అందుబాటులో ఉంది. దీనిని ఫిల్టర్ చేసిన నీటిలో మరగబెట్టి, ఆ తర్వాత ఫిల్టర్ చేయాలి. అయితే ఈ పౌడర్ ను మీరు ఇంట్లో కూడా తయారు చేకసుకోవచ్చు. దీని కోసం మీరు కొన్ని మునగాకులను తీసుకొని వాటిని ఎండలో ఆరబెట్టాలి. తరువాత దీనిని పౌడర్ చేసుకోండి. 

మునగాకు పౌడర్ ను వేడి చేస్తే అందులో ఉన్న పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి దీనిని నేరుగా తీసుకోవడం లేదా ఇష్టమైన ఆహారంలో లేదా డ్రింక్స్ తో కలిపి తీసుకోండి. ఈ పౌడర్ ను ఉడకించకుండా తీసుకోవడం బెస్ట్..

Leave a Comment