న్యూడ్ ఫొటోలు పెడతామని బెదిరింపులు.. గుంటూరులో లోన్ యాప్ వేధిపులకు మహిళ బలి..!

లోన్ యాప్ వేధింపులకు ఓ బలైంది. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల మరకు మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష(24) ఇండియన్ బుల్స్, రూపెక్స్ యాప్స్ నుంచి రూ.20 వేలు లోన్ తీసుకుంది. వాటిలో రూ.12 వేలు కట్టింది. రూ.8 వేలు మాత్రమే బకాయి ఉంది. 

అయితే కొన్ని రోజులగా లోన్ యాప్స్ కాల్ సెంటర్ నుంచి ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. డబ్బులు కట్టాలని, లేకపోతే న్యూడ్ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని ఆమెను బెదిరించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ప్రత్యూష సోమవారం తెల్లవారుజామున ఇంటిపైన ఉన్న ఫ్లెక్సీ హోర్డింగ్ కి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఆత్మహత్య చేసుకునే ముందు తల్లిదండ్రులకు, భర్తకు సెల్ఫీ వీడియో పంపింది. ‘లోన్ యాప్ లో రుణం తీసుకున్నా. డబ్బులు కడుతూనే ఉన్నా. అయినా టార్చర్ చేస్తున్నారు. కట్టకపోతే బంధువులకు ఫోన్ చేసి చెప్తానని బెదిరిస్తున్నారు. నాకు వేరే దారి లేదు. సారీ అమ్మా’ అంటూ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చింది.  

ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిన ఉదయం కూడా ఆమె ఫోన్, వాట్సాప్ ద్వారా వేధింపు కాల్స్ వస్తునే ఉన్నాయి. ఆమె వాట్సాప్ కాంటాక్ట్స్ కి ఆమెను అసభ్యంగా కించపరుస్తూ సందేశాలు పంపుతున్నారు. ప్రత్యూష భర్త రాజశేఖర్ మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Leave a Comment