Viral Video : అమ్మో బాబోయ్.. ‘షూ’ లోపల పాము.. వేసుకునే ముందు ఓసారి చెక్ చేసుకోండి..!

పాడుబడ్డ ఇళ్లలో, చెట్లు, పొదల్లో అకస్మాత్తుగా పాములు కనిపించి భయాందోళనకు గురిచేస్తుంటాయి.. అదే మనం వేసుకునే షులో పాము ఉంటే పరిస్థితి ఏంటీ.. తాజాగా జరిగిన ఓ ఘటన భయంతో వణుకుపుట్టేలా ఉంది.. చెప్పుల స్టాండులో ఉన్న షూలో ఓ నాగుపాము ముడుచుకొని పడుకుంది.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. 

ఓ మహిళ తన చెప్పుల స్టాండులో నుంచి షూ వేసుకునేందుకు వచ్చింది. ఆ మహిళకు షూ లోపల పాము కనిపించింది. వెంటనే ఓ ఇనుప రాడ్ ను షూ లోపల నెట్టింది. దీంతో ఆ నాగుపాము పడగ విప్పి మహిళను కాటు వేసేందుకు ప్రయత్నించింది. చివకిరి ఆ పామును బయటకు పంపారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘వర్షాకాలంలో పలు ప్రదేశాల్లో పాములు కనిపిస్తాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తతుం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment