చలి వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు.. ఈ చిట్కాలతో అవి దూరం..!

చలికాలం మొదలు అయినప్పటి నుంచి చల్లటి గాలులు రావడం ఉంటుంది.ఈ గాలుల వల్ల చాలా మంది ఇబ్బంది చెందుతారు. వాతావరణంలో జరిగే ఈ మార్పులు వల్ల ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో అందరు జాగ్రత్తగా ఉండాలి. చల్లటి గాలులతో ఎలాంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాము. చలికాలంలో ఎక్కువ సేపు వాతావరములో పొగమంచు, మేఘాల ఉండటము వల్ల  చాలా రోజులు పాటు ఎక్కువ సూర్యరశ్మి ఉండదు. సూర్య కాంతి మనిషి జీవితములో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది,ఇది లేకపోతే  చాలా పనులు కూడా సజావుగా జరగవు. అలాంటి సూర్యకాంతి లేనప్పుడు, శరీరంలో విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. 

తేమ, ఉష్ణోగ్రత కారణంగా, ఎముకలు, కీళ్లు, కండరాలు నొప్పి వస్తుంది. సాధారముగా వాతావరణం మారినప్పుడల్లా, దాదాపు ప్రతి ఒక్కరికీ జలుబు, దగ్గు సమస్య ఉంటుంది. అటువంటి పరిస్థితిలో బయటకు వెళ్లే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాసకోశ వ్యాధులు ఉండటం చల్లని గాలి, తేమకు గురికావడం వల్ల బ్రోన్కైటిస్ వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వస్తాయి. జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని తాగించడనికి వేడినీరు తాగాలి.

శీతాకాలంలో చర్మ సమస్యలు సర్వ సాధారము. చల్లటి వాతావరణం చర్మాన్ని పాడు చేస్తుంది,దీని ఫలితంగా పొడి, దురద చర్మం, పగిలిన పెదవులు సమస్య వస్తుంది. శీతాకాలంలో చర్మ సంరక్షణ కోసము తప్పనిసరిగా మాయిశ్చరైజింగ్, సన్ ప్రొటెక్షన్  క్రీములను వాడాలి అని నిపుణుల అంటున్నారు.ఈ కాలములో చల్లని పనియాలు తాగడం, ఐస్ క్రింలు, చాక్లెట్ లాంటి వి తినకపోవవడం చాలా మంచిది.

ఈ చల్లని కాలంలో ఉష్ణోగ్రతతో పాటు వాతావరణ పీడనం తగ్గుతుంది. ఇది తరచుగా రక్తపోటు లేదా అధిక రక్తపోటుకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో వెల్లుల్లి, అరటి, సిట్రస్ పండ్లు, తేనెను తీసుకోవాలి. ప్రతిరోజు తగినన్ని నీరు తీసు కోవడము ఎంతో మంచి ఉపయోగం ఇస్తుంది. నీరు మన శరీరాన్ని శుభ్ర పరచడానికి, వ్యర్థాలను బయటకూ పంపడానికి, శరీర కణాలకు పోషకాలను అందించడానికి, శరీర ద్రవాన్ని సమతుల్యం చేయడానికి ఎంతో గానో ఉపయోగ పడుతుంది.శీతాకాలం అంతా ఆరోగ్యంగా ఉండటానికి శారీరక శ్రమ ఒక ముఖ్యమైన అంశం. రోజువారీ దినచర్య లేదా ఏదైనా శారీరక శ్రమ ఆరోగ్యంగా ఉంచడానికి సహాయ పడుతుంది. ఫ్లూ, జలుబు వంటి కాలానుగుణ వ్యాధుల నుండి రక్షణను మెరుగుపరిచే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ప్రతీ రోజు ఆవిరి పట్టుకోవడం ఈ కాలములో మంచిది. ఇలా ఆవిరి పట్టడము వల్ల శ్వాస శ్వాసకు ఇబ్బంది కలిగించే శ్లేష్మం ‌ను పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే అల్లం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మేలుగా ఉంటుంది.ధూమపానం శ్వాసకోశ సమస్యలు మరియు ఊపిరితిత్తుల సమస్యలను ఎక్కువ చేస్తుంది.దూమపానం అలవాటు ఉన్న వారు మానేయాలి.

 

Leave a Comment