ఫిబ్రవరి 15 నాటికి కరోనా తగ్గుతుందట..!

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా నిత్యం 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 20 శాతానికి మించిపోయింది. అయితే మూడు రోజులుగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. 

ఈక్రమంలో ప్రభుత్వ వర్గాలు కీలక సమాచారం అందించాయి. ఫిబ్రవరి 15 నాటికి కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. కొన్ని రాష్ట్రాలు, మెట్రో నగరాల్లో కరోనా కేసులు తగ్గడం, స్థిరంగా ఉండటం ప్రారంభమైందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా థర్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించిందని పేర్కొన్నాయి. 

ఇప్పటి వరకు వయోజన జనాబాలో 74 శాతం పూర్తిగా వ్యాక్సిన్ వేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 15 నుంచి 18 మధ్య వయస్కులో ఉన్న వారికి తొలి డోసు ఇస్తున్నారు. 60 ఏళ్లు దాటి ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, ఫ్రంట్ లైన్ సిబ్బంది, వైద్య సిబ్బందికి ప్రికాషనరీ డోసులుఇవ్వడం వల్ల మూడో వేవ్ తీవ్రతను తగ్గించిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 

Leave a Comment