కారు రూ.10 కాదంటూ రైతును అవమానించిన సేల్స్ మ్యాన్..గంటలో రూ.10 లక్షలు తెచ్చి..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘స్నేహం కోసం’ సినిమా గుర్తిందా.. ఆ సినిమాలోని ఓ సీన్ లో చిరంజీవి, విజయ్ కుమార్ కలిసి ఓ కార్ షోరూంకి వెళ్తారు.. అయితే ఆ షోరూం సిబ్బంది వారిని అవమానిస్తారు. దీంతో ఆటోలో తెచ్చుకున్న గోనె సంచిలో నుంచి డబ్బుల కట్టలు కిందికి పోస్తారు. అంతే ఆ షోరూం సిబ్బంది షాక్ అవుతారు. ఇలాంటి సీన్ కర్ణాటకలోని తుముకూర్ లో ఉ్న మహీంద్రా షోరూంలో నిజంగా జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. కెంపేగౌడ అనే రైతు తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్ చూసేందుకు మహీంద్రా షోరూంకి వెళ్లారు. కానీ ఆ షోరూంలో పనిచేసే సేల్స్ ఏజెంట్ వీరి వేషధారణ చూసి అవమానించాడు. కార్ ధర రూ.10 అనుకున్నారా.. అంటూ అవమానకరంగా మాట్లాడాడు. అంతే ఆ సేల్స్ మ్యాన్ మాటలకు కెంపేగౌడకు కోపం వచ్చింది.

రైతు కెంపేగౌడ ఒక గంటలో రూ.10 లక్షలు తీసుకొచ్చి కారు డెలివరీ చేయాలని డిమాండ్ చేశాడు. రైతు ఇలా చేయడంతో షోరూం సిబ్బంది షాక్ కు గురైంది. మూడు రోజుల్లో కారు డెలివరీ చేస్తామని రైతుకు, అతని స్నేహితులకు చెప్పారు. అక్కడి నుంచి వెళ్లిన కెంపేగౌడ తిలక్ నగర్ పోలీసులోకు షోరూం సిబ్బందిపై ఫిర్యాదు చేశాడు. దీంతో సేల్స్ ఏజెంట్, ఇతర సిబ్బంది కెంపేగౌడకు క్షమపణలు చెప్పారు. పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి వివాదానికి ముగింపు పలికారు.     

Leave a Comment