రిపోర్టర్ గా మారిన చిన్నారి.. ఆమె రిపోర్టింగ్ చూస్తే ఫిదా అవుతారు..!

కశ్మీర్ కి చెందిన ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆ చిన్నారి రిపోర్టర్ గా మారింది. అక్కడి వీధుల్లో అధ్వాన్న స్థితిని చూపిస్తూ.. తన క్యూట్ మాటలతో ఆకట్టుకుంటోంది.. కశ్మీర్ శివారు ప్రాంతాల్లో రోడ్డు ఎంత అధ్వనంగా ఉన్నాయో.. ప్రజలు ఏవిధంగా చెత్త పారేస్తున్నారో వివరించింది. 

రోడ్డు దారుణంగా ఉండటం వల్ల తన ఇంటికి అతిధులు రాలేకపోతున్నారని ఈ చిన్నారి వీడియోలో వివరించింది. వీధుల్లో గుంతలను చూపించాలని కెమెరామెన్ తో చెబుతోంది. రిపోర్టర్ మాదిరి చెప్పి చివరిలో కెమెరామెన్ అమ్మతో అని వీడియో ముగించింది. ఇటీవల కశ్మీర్ లోయలో భారీ మంచు కురుస్తూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు బురదమయంగా మారి అధ్వానంగా మారాయి.

రోడ్ల పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ మొబైల్ ఫోన్ లో చిత్రీకరించిన రెండు నిమిషాల వీడియోలో ఈ చిన్నారి గుంతలను చూపిస్తూ ముందుకు సాగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. అంతేకాదు వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్ లు వచ్చాయి. ఈ చిన్నారి వీడియో సందేశాల ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేయడం ఇది మొదటిసారి కాదు.. ఆరేళ్ల మహీరు ఇర్ఫాన్ గత సంవత్సరం ఆన్ లైన్ తరగతుల వ్యవధిపై పరిమితిని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీని ఉద్దేశించి 71 సెకన్ల వీడియోను చేసింది. అది బాగా వైరల్ అయింది. ఈ వీడియో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దృష్టిని ఆకర్షించింది. ఆయన పాఠశాల విద్యార్థులపై హోంవర్క్ భారాన్ని తగ్గించడానికి విధానాన్ని రూపొందించాలని విద్యాశాఖను ఆదేశించారు. 

 

  

Leave a Comment