బాడీ మెటబాలిజం పూర్తిగా హరించేసే కొన్ని అలవాట్లు..!

చక్కెర ఉన్న పానియాలు తాగడం వల్ల శరీరంలో ఇన్సూలిన్‌ స్థాయి పెరిగిపోతుంది. దీనివల్ల ఒబేసిటీ, డయాబెటీస్‌ వస్తుంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల బాడీ మెటబాలిజం తగ్గిపోతుంది.ప్రోటిన్లు పుష్కలంగా ఉన్న ఫుడ్‌ను తీసుకోవడం శరీరానికి ఎంతో అవసరం.ఎక్కువ ప్రోటిన్‌ ఆహారం వల్ల శరీరంలో కేలరీలు బర్న్‌ చేసే కెపాసిటీ పెరగడంతోపాటు జీర్ణక్రియ తర్వాత జరిగే జీవక్రియ పెరుగుదలను థర్మిక్‌ ఎఫెక్ట్‌ అంటారు. 

ప్రోటిన్‌ థర్మిక్‌ ప్రభావం పిండి పదార్థాలు లేదా కొవ్వు కంటే చాలా ఎక్కువ. ప్రోటిన్ల వల్ల 20-30 శాతం జీవక్రియను పెంచుతుంది. కార్బొహైడ్రేట్‌లకు 5-10 శాతం, ఫ్యాట్‌ 3 శాతం లేదా అంతకంటే తక్కువ జీవక్రియ రేటును అనివార్యంగా తగ్గిస్తుంది. నిద్ర శరీరంపై ఎంతో ప్రభావం చూపుతుంది. డిప్రెషన్, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. దీంతో మెటబాలిక్‌ రేటు కూడా పడిపోతుంది.

చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్‌ చేస్తారు. దీనివల్ల కూడా మెటబాలిజం పై ప్రభావం పడుతుంది. పడుకున్న సమయంలో దీనిరేటు తగ్గుతుంది. ప్రతిరోజూ ఒక గ్లాస్‌ మందు తాగితే ఏమవుతుంది అనుకుంటారు. కానీ, వారం మొత్తం తాగితే మెటబాలిజం రేటుపై ప్రభావం చూపుతుంది.ఫ్రూట్స్, వెజిటేబుల్స్‌లో కార్బొహైడ్రేట్స్‌ పుష్కలంగా ఉంటాయి. తెల్లగా ఉండే చక్కెర వంటివి రీఫైన్డ్‌ చేసినవి. అధిక ఫైబర్‌ తృణధాన్యాలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. 

శరీరానికి సరిపోయే నీటిని తీసుకోకపోతే మెటబాలిజం రేటు పడిపోతుంది. నీరు ఎక్కువ శాతం ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి.బాగా స్ట్రెస్‌లో ఉన్నపుడు శరీరం కార్టిసల్‌ అనే హార్మొన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే మీ శరీరానికి శక్తినిచ్చే ఫుడ్‌ అవసరమని అర్థం. ఇది ఎక్కువైతే కష్టం.

 

Leave a Comment