నీ గొప్ప మనసుకు హ్యాట్ఫాఫ్..!

మన దేశంలో పెళ్లిళ్లలో అతిథులకు నోరురించే వంటకాలతో భోజనం పెడతారు. ఈక్రమంలో ఆహారం మిగిలిపోతుంటుంది. పెళ్లిళ్లలో వేస్ట్ అయిన ఆహారాన్ని పారేస్తుంటారు. అయితే పెళ్లిలో మిగిలిన ఆహార పదార్థాలను వృథా పోనీయంకుడా నిరుపేదలకు అందిస్తే.. కనీసం ఒక్కపూట వారి కడుపు నింపవచ్చు.. తాజాగా కోల్ కతాకి చెందిన ఓ మహిళ తన సోదరుడి పెళ్లిలో మిగిలిన ఆహారాన్ని పడేయకుండా స్వయంగా రేల్వే స్టేషన్ కి తీసుకెళ్లి పేదల కడుపు నింపింది.

కోల్ కతాకు చెందిన ఓ మహిళ సోదరుడి వివాహం శనివారం రాత్రి జరిగింది. వివాహంలో చాలా ఆహారం మిగిలిపోయింది. అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. అయితే ఆహారాన్ని వృథా పడేయకుండా పేదలకు పంచాలని అనుకుంది. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఆ మహిళ ఆహారాన్ని తీసుకుని కోల్ కతా సబర్బన్ రైల్వే స్టేషన్ రాణాఘాట్ కి తీసుకెళ్లింది. 

రైల్వే స్టేషన్ లో ఆకలితో ఉన్న వారిని పిలిచి ప్లేట్లలో అందరికీ స్వయంగా వడ్డించింది. అదే సమయంలో అక్కడ ఉన్న నీలాంజన్ మండల్ అనే ఫొటో గ్రాఫర్ ఆమె వారికి వడ్డిస్తుండగా ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. ఆమె చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.    

 

Leave a Comment