జనవరి, ఫిబ్రవరి మధ్య.. కరోనా థర్డ్ వేవ్..!

ప్రపంచ దేశాలను కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లోనూ ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మధ్య కరోనా థర్డ్ వేవ్ పీక్ కు చేరే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ థర్డ్ వేవ్ ఎక్కువ తీవ్రంగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

భారత్ లో కరోనా మహమ్మారి గ్రాఫ్ ను మ్యాథమేటికల్ గా అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్ర మోడల్ ను రూపొందించిన మనీంద్ర అగర్వాల్ ను ఏర్పాటు చేసింది. ఆయన అంచనా ప్రకారం మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య వచ్చే ఏడాది తొలి మాసంలో పీక్ కి చేరుకోవచ్చన్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని, అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వైరస్ కట్టడి చర్యలతో థర్డ్ వేవ్ ని తగ్గించవచ్చని తెలిపారు. 

దేశంలో వచ్చే ఏడాది ప్రారంభంలోనే థర్డ్ వేవ్ రావచ్చని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ వైరస్ ఎంతమేరకు ప్రభావం చూపుతుందనే విషయం ప్రభుత్వాలు తీసుకునే కట్టడి చర్యలపైనే ఆధారపడి ఉందని తెలిపారు. గతంలో మాదిరిగానే నైట్ కర్ఫ్యూ, మీటింగ్ లు, సంబరాలపై ఆంక్షలు విధించాలని ఆయన సూచించారు. అయితే ఒమిక్రాన్ ప్రభావంతో ఎక్కడా క్రిటికల్ కండిషన్ కు చేరిన దాఖాలాలు లేవని ఆయన గుర్తు చేశారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. వైరస్ సోకిన తర్వాత తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు.  

 

 

 

Leave a Comment