సొంత తల్లిదండ్రులపై కేసు పెట్టిన హీరో విజయ్.. ఎందుకో తెలుసా?

దళపతి విజయ్.. తమిళంలోని కాదు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి స్టార్ హోదాను సంపాదించుకున్నారు. తాజాగా ఆయన తన సొంత తల్లిదండ్రులతో సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో కేసు పెట్టాడు. తన అనుమతి లేకుండా తన పేరును వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇంతకు విషయం ఏంటంటే.. ఏడాది క్రితం విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ ‘ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్’ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. ఈ పార్టీకి విజయ్ తండ్రి ప్రధాన కార్యదర్శిగాను, తల్లి శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఉన్నారు. మరి కొంతమంది ఇతర పదవుల్లో ఉన్నారు. 

పార్టీ పెట్టిన కొన్ని రోజులకు విజయ్ ఓ ప్రకటన చేశాడు. తన నాన్న పెట్టిన పార్టీతో నేరుగా, పరోక్షంగా గానీ తనకు సంబంధం లేదని, తన నాన్న పార్టీ పెట్టారని, తన ఫ్యాన్స్ ఎవరూ అందులో చేరవద్దని విజయ్ ప్రకటించాడు. పార్టీ కోసం తన పేరు, ఫొటో, ఫ్యాన్స్ క్లబ్ ను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపాడు. తన నాన్న పెట్టిన పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని, పార్టీ విషయంలో తన పేరును వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై కేసు పెట్టాడు. ఇకపై తన పేరుతో ఎటువంటి మీటింగులు, కార్యక్రమాలు నిర్వహించకుండా ఉండేందుకు ఈ కేసు పెట్టానని విజయ్ పేర్కొన్నాడు. ఈ కేసుపై సెప్టెంబర్ 27న కోర్టులో విచారణ జరగనుంది. 

Leave a Comment