అన్నం తినడం లేదని మూడేళ్ల కూతురును తాడుతో దారుణంగా కొట్టిన తండ్రి.. వీడియో వైరల్..!

కన్న కూతురును తండ్రి మహారాణిలా చూసుకుంటాడు. కూతురికి ఏ చిన్న కష్టం వచ్చిన తండ్రి తట్టుకోలేడు. చాలా మంది తండ్రులు తమ కూతుర్లను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. కానీ ఇక్కడ ఓ తండ్రి మాత్రం మూడేళ్ల కూతురి పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. తాడుతో దారుణంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. 

మేదక్ కు చెందిన మేడిశెట్టి నాగరాజుకు గగన శ్రీ అనే మూడేళ్ల పాప ఉంది. ఆ చిన్నారి అన్నం తినడం లేదని తండ్రి దారుణంగా కొట్టాడు. తాడుతో చిన్నారి మొఖం, వీపు భాగాల్లో విచక్షణరహితంగా కొట్టాడు. మొదటి భార్య కుమార్తెను ఇంత కొడుతున్న రెండో భార్య మాత్రం వెకిలి నవ్వులు నవ్వుతూ కూర్చుంది. భార్య లోపలికి వెళ్లగానే నాగరాజు మరింత రెచ్చిపోయాడు. ఆ చిన్నారి మెడ పట్టుకుని పైకి లేపి మరీ కొట్టాడు. 

చిన్న పాపను అలా కొడుతుంటే ఇంటి పక్కన ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టు పోలీసుల వరకు వెళ్లింది. కుమార్తెను తండ్రి కొట్టిన విషయం నిజమేనని మేదక్ పోలీసులు ధ్రువీకరించారు. అనంతరం తండ్రికి, అతని రెండో భార్యకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  ఆ వ్యక్తిపై నెటిజన్లు మండిపడుతున్నారు.    

 

Leave a Comment