మలబద్ధకం సమస్య ఉందా?..ఈ చిట్కాలను పాటించండి..!

ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం.. దీనికి ప్రధాన కారణం మారిన జీవిన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకపోవడం. ఎవరిలోనైనా వారికి సహజ పద్ధతిలో మార్పు సంభవించి జరగాల్సిన సమయంలో మల విసర్జన జరగనట్లయితే దానిని మల బద్ధకంగా భావించాలి. మలబద్ధకాన్ని తేలికగా తీసుకోకూడదు. మనిషిలో వచ్చే చాలా రకాల వ్యాధులకు మలబద్దకమే మూల కారణంగా ఉంటుంది. మలబద్ధకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, హైపర్ టెన్షన్, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మలబద్ధకం నివారణకు చిట్కాలు:

  • ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. 
  • పీచు పదార్థాలు ఎక్కువగా తినాలి. ఆకుకూరలు, అరటి, జామ వంటి వాటిని ఎక్కువగా తినాలి. 
  • పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటి పండ్లు, పైనాపిల్, బత్తాయి, సపోట పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీటిని నిత్యం ఆహారపు అలవాట్లలో భాగంగా చేర్చుకోవడం వల్ల మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. 
  • ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు మానేయాలి. టీ, కాఫీలు తక్కువగా తీసుకోవాలి. 
  • నిల్వ ఉంచిన పచ్చళ్లు తినడం మానేయాలి. వేళకు ఆమారం తీసుకోవాలి. 
  • నీరు సరిపడినంతగా తాగాలి. రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల నీరు తీసుకోవాలి. 
  • రోజూ వ్యాయామం చేయడం వల్ల మలబద్ధకం సమస్య రాదు. 
  • మొలకెత్తిన గింజలు, నూనె లేకుండా చపాతి, జొన్న రొట్టెలు తీసుకోవడం కూడా చాలా మంచిదే. వారానికోసారైనా సాయంత్రంపూట గుగ్గిళ్లు వంటివి తీసుకోవాలి. 
  • రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలను తాగాలి. లేదా పాలలో ఆముదం కలుపుకుని కూడా తాగవచ్చు. దీంతో మరుసటి రోజు విరేచనం సాఫీగా అవుతుంది. 
  • ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగాలి. నిత్యం 3 పూటలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. 
  • ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు త్రిఫల చూర్ణం కొద్దిగా తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. దీంతో మలబద్ధకం సమస్య తగ్గుతుంది.  
  • ప్రతిరోజూ కాఫీ తీసుకోవడం కూడా మలబద్ధకానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాఫీ డైజెస్టివ్ సిస్టంలో ఉండే మజిల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. అయితే కేఫినేటెడ్ కాఫీ తీసుకోవడం మంచిది. 

Leave a Comment