జయసుధకు ఏమైంది.. ఎందుకు ఇలా మారిపోయింది..?

181
Jayasudha

ఏంటీ ఈమే జయసుధనేనా? ఏంటీ ఇలా అయిపోయింది..? అసలు ఈమె జయసుధ అని నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉన్నా.. ఆమె సహజనటి జయసుధనే.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలో జయసుధను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. జయసుధ అలా మారిపోవడానికి కారణమేంటో ఆమె ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.. 

దాదాపు 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో వందల సినిమాల్లో నటించింది. అయితే ఒకప్పుడు బిజీగా ఉండి కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా భర్త నితిన్ కపూర్ మరణం తర్వాత ఈమెకు సినిమాలపై ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. ఈమధ్య ఆమె కొడుకు నిహార్ కపూర్ గ్యాంగ్ స్టర్ గంగరాజు అనే సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. 

అయితే జయసుధ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్న పిల్లల కోసం ఆమె ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆమె ఇంతలా మారిపోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. ఏదైనా అనారోగ్యానికి గురైందా లేదంటే వయసు రీత్యా ఇలా మారిపోయిందా అనే విషయాలు అంతు చిక్కడం లేదు. ఏది ఏమైనా జయసుధ లేటెస్ట్ ఫొటోస్ మాత్రం అభిమానులకు షాక్ కు గురిచేస్తోంది.     

Previous articleరాత్రి వేళ ఆకలి సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఇది మీకోసమే..!
Next articleమలబద్ధకం సమస్య ఉందా?..ఈ చిట్కాలను పాటించండి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here