ఈ ఫొటోలో ఉన్నదేంటో గుర్తుపట్టగలరా..?

ఈ అందమైన పైథానీ చీర, బంగారు ఆభరణాలను చూడగానే వాటిని ధరించాలని కచ్చితంగా ఏ మహిళకైనా అనిపిస్తుంది. కానీ ఇది చీర కాదు ఇదొక కేక్. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? అవును ఇది నిజంగా కేక్.. పూనెలోని జె.డబ్ల్యూ మార్యట్ హోటల్ లో పనిచేసే తన్వీ పల్వికర్ అనే మహిళ చెఫ్ ఈ కేక్ ను తయారు చేశారు. ప్రస్తుతం ఈకేక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సాధారణంగా తన్వీ ఏ కేక్ చేసినా ఇన్ స్టాగ్రామ్ లేదా ఫేస్ బుక్ లో పెడుతుంది. అలా ఈ కేక్ ను కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. ఈ కేక్ లో తన్వీ మహారాష్ట్ర సంస్కృతిని చూపించాలని ప్రయత్నం చేసింది. 5 కిలోల ఈ చాక్లెట్ కేక్ తయారు చేయడానికి తన్వీకి రెండు రోజులు పట్టింది. ఇక ఈకేక్ పై జ్యూయెలరీని డిజైన్ చేయడానికి ఆమెకు సవాలుగా మారిందని తన్వీ చెప్పింది. ఆ కేక్ నిజం చీరల కనిపించేందుకు చాలా కష్టపడింది. అది చూసిన వారు నిజంగా చీర అనుకున్నట్లు కామెంట్లు చేశారట.. తన్వీ ఇప్పటి వరకు ఎన్నో కేకులు తయారు చేశారు. కానీ తన ఫేవరెట్ కేక్ మాత్రం ఇంకా తయారు చేయలేదని చెబుతున్నారు. 

Leave a Comment